దేశవ్యాప్తంగా 21 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలుపర్యావరణం, ఇంధన సంరక్షణలో భాగంగా జాతీయ విద్యుత్ దీపాల పథకం కింద దేశవ్యాప్తంగా 21 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశామని కేంద్ర విద్యుత్ శాఖ ఏప్రిల్ 28న వెల్లడించింది. ఈ పథకం కింద రాజస్థాన్‌లో అత్యధికంగా 7,04,891 ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ 5,86,037 ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుతో రెండో స్థానంలో నిలిచింది. వీటి ఏర్పాటుతో 2.3 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల కాకుండా నిరోధించగలిగామని, 295 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని ప్రభుత్వం ప్రకటించింది.
జాతీయ విద్యుత్ దీపాల పథకాన్ని ప్రధాని మోదీ 2015 జనవరి 5న 100 పట్టణాల్లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతోంది. జీఎస్‌టీతో 8 శాతం పైన వృద్ధి : ఐఎంఎఫ్ 2017 జూలై 1 నుంచి అమలు కానున్న జీఎస్‌టీ వల్ల భారత వృద్ధి మధ్యకాలంలో 8 శాతం పైగా నమోదుకావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్ ) అంచనా వేసింది. ఈ మేరకు ఏప్రిల్ 28న ఓ నివేదిక విడుదల చేసిన సంస్థ.. భారత్ 2016-17లో 6.8 శాతం, 2017-18లో 7.2 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్ ఎకానమీ అని ఐఎంఎఫ్ పేర్కొంది. బుందేల్‌ఖండ్ నీటి సంరక్షణ పథకం ప్రారంభం తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నీటి సంరక్షణ పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సాగర్ జిల్లాలోని బాంద్రీలో ఏప్రిల్ 28న పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో వాన నీటి సంరక్షణ కోసం చిన్న నీటి కుంటలు, చెక్ డ్యాంలు, చెరువులను అభివృద్ధి చేస్తారు. తద్వారా భూగర్భ జలాలను పెంచుతారు. రాష్ట్రాలకు నేరుగా విదేశీ రుణం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విదేశీ రుణ సంస్థల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోదం తెలిపినట్టు ఏప్రిల్ 19న ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ రుణ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నేరుగా అప్పు తీసుకునేందుకు ఈ మార్గదర్శకాలు దోహదపడతాయి. వీటికి కేంద్రం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ విజన్ 2031 - 32 నివేదిక2032కల్లా అందరికీ అందుబాటులో గృహాలు, ద్విచక్ర వాహనాలు లేదా కార్లు, విద్యుత్తు, ఎయిర్ కండీషనర్లు, డిజిటల్ కనెక్టివిటీని అందుబాటులోకి తేవాలని నీతి ఆయోగ్ పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన విజన్ 2031 -32 నివేదికను ఏప్రిల్ 23న జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా వెల్లడించారు. కీలక ప్రతిపాదనలు
2017-18లో భారత వృద్ధి రేటు 7.2 శాతం : ప్రపంచ బ్యాంకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు “Globalization Backlash” పేరుతో ఏప్రిల్ 17న నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2016-17లో 6.8 శాతంగా నమోదైన భారత వృద్ధి రేటు 2017-18లో 7.2 శాతానికి చేరుతుందని.. 2018-19 నాటికి ఇది 7.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. జీఎస్టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని తెలిపింది. దక్షిణాసియా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 2017లో భారత వృద్ధి రేటు 7.2 శాతం : ఐఎంఎఫ్2017 సంవత్సరానికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 7.2 శాతంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. డీమోనిటైజేషన్ నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల వృద్ధి రేటును కుదిస్తున్నట్లు తాజా వార్షిక ప్రపంచ ఆర్థిక విశ్లేషణ (డబ్ల్యఈఓ)లో వెల్లడించింది. మరో వైపు 2016లో 3.1 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 2017లో 3.5 శాతానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇది 2018లో 3.6 శాతానికి చేరుతుందనీ తెలిపింది. ఇక చైనా వృద్ధి రేటు 2017లో 6.6 శాతంగా ఉంటుందని పేర్కొన్న ఐఎంఎఫ్, 2018లో ఇది 6.2 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. 5 నగరాల్లో రోజూ పెట్రోల్ ధర మార్పుఅంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మే 1 నుంచి రోజూ మారనున్నాయి. ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ విధానాన్ని మొదట విశాఖపట్నం, ఉదయ్‌పూర్, జంషెడ్‌పూర్, చండీగఢ్, పుదుచ్చేరి నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. మార్చిలో 5.7% తగ్గిన టోకు ద్రవ్యోల్బణంటోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో 5.7 శాతానికి తగ్గింది. కూరగాయలు, పప్పుదినుసులు వంటి ఆహార వస్తువుల ధరలు పెరిగినప్పటికీ డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటంతో తయారీ వస్తువులు, చమురు ధరలు తగ్గాయి. దాంతో టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. కార్పొరేట్ అవినీతిలో 9వ స్థానంలో భారత్ వ్యాపారాల నిర్వహణలో అవినీతి, లంచగొండితనం విధానాలు పాటిస్తున్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిల్చింది. ఈ మేరకు కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఏప్రిల్ 6న యూరప్, మధ్యప్రాచ్యం, భారత్, ఆఫ్రికా (ఈఎంఈఐఏ) ఫ్రాడ్ సర్వే 2017ను విడుదల చేసింది. 41 దేశాలతో కూడిన ఈ జాబితాలో ఉక్రెయిన్ తొలిస్థానంలో ఉండగా సెప్రస్, గ్రీస్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రివర్స్ రెపో రేటు 0.25 శాతం పెంపు ఏప్రిల్ 6న జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటుని 6.25 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. రివర్స్ రెపో రేటుని మాత్రం 0.25 శాతం పెంచింది. దీంతో రివర్స్ రెపో రేటు 6 శాతానికి చేరింది. (రివర్స్ రెపో - బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేసే నిధులకు లభించే వడ్డీ రేటు) 2020కి భారత ఇంటర్నెట్ వ్యాపారం 250 బిలియన్ డాలర్లు : బీసీజీ2020 నాటికి భారత ఇంటర్నెట్ ఎకానమీ 250 బిలియన్ డాలర్ల స్థాయికి (రూ.16,25,000 కోట్లు) చేరనుంది. ఈ మేరకు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టీఐఈ) ఏప్రిల్ 7న నివేదిక విడుదల చేశాయి. భారత్‌లో ప్రస్తుత ఇంటర్నెట్ వ్యాపారం 100 - 130 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. ప్రస్తుతం భారత్ 39.1 కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 2020 నాటికల్లా ఈ సంఖ్య 65 కోట్లకు చేరనుంది. పర్యాటకంలో భారత్‌కు 40వ ర్యాంకు ప్రపంచ ప్రయాణ, పర్యాటక పోటీతత్వ జాబితా - 2017 ( Travel and Tourism Competitive Index )లో భారత్ 40వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఏప్రిల్ 6న నివేదికను విడుదల చేసింది. 2016లో దేశంలో పర్యాటక అభివృద్ధి సమాచారం ఆధారంగా భారత్‌కు ఈ ర్యాంకు కేటాయించినట్లు సంస్థ పేర్కొంది. పర్యాటకంగా 2013 ర్యాంకింగ్స్‌లో 65వ స్థానంలో నిలిచిన భారత్ 2015లో 52వ స్థానంలో నిలిచింది. మూడేళ్లలో రూ.1.37 లక్షల కోట్ల పన్ను ఎగవేత గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం రూ.1.37 లక్షల కోట్ల పన్ను ఎగవేతలను ఆదాయ పన్ను విభాగం గుర్తించింది. ఏప్రిల్ 7న ఈ వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ఈ సమయంలో పన్నుల ఎగవేతకు సంబంధించి 2,814 కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. జీఎస్టీ బిల్లులకి లోక్‌సభ ఆమోదం జీఎస్టీ (Goods and Service Tax)కి సంబంధించిన 4 అనుబంధ బిల్లులకు మార్చి 29న లోక్‌సభ ఆమోదం తెలిపింది. 7 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం సెంట్రల్ జీఎస్టీ బిల్లు(సీజీఎస్టీ) -2017, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ బిల్లు(ఐజీఎస్టీ)-2017, యూనియన్ టెరిటరీ జీఎస్టీ బిల్లు (యూటీజీఎస్టీ)-2017, జీఎస్టీ పరిహార బిల్లు (రాష్ట్రాలకు)-2017లను లోక్‌సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో అసలు జీఎస్టీ అంటే ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలతో కూడిన సమగ్ర విశ్లేషణ మీకోసం... జీఎస్టీ అంటే... దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ అమలు కోసం, పన్నుపై పన్ను వేసే పద్ధతిని నిర్మూలించే ఉద్దేశంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని రూపొందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే వస్తువులు లేదా సేవల సరఫరాపై విధించే సమగ్ర పన్ను. ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో జీఎస్‌టీ లేదా వ్యాట్ అమలవుతోంది. అమలు విషయానికొస్తే ఒక వస్తువు వినియోగదారుడిని చేరాలంటే ముడిసరుకు నుంచి తయారీ, హోల్‌సేల్, రిటైల్ ఇలా పలు దశలుంటాయి. సేవల విషయంలోనూ అంతే. ప్రతి దశలోనూ కొంత విలువ జోడిస్తారు. అందువల్ల ఈ దశలన్నింటిలో పన్ను వసూలవుతుంది. కొన్నిసార్లు పన్నుపై పన్ను వసూలు చేస్తున్నారు. జీఎస్టీ అమలుతో ఈ పన్నులన్నీ రద్దయి ఒకే పన్ను అమలవుతుంది. కేంద్ర ఎకై ్సజ్ సుంకం, రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్), వినోద, విలాస, ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ స్థానంలో.. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఒక్కటే ఉంటుంది. ఒక్క జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మినహా దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ వర్తిస్తుంది. సీజీఎస్టీ బిల్లు
ఐజీఎస్టీ బిల్లు...జీఎస్‌టీలోని ప్రధాన మూడు భాగాల్లో (సీజీఎస్‌టీ, ఐటీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ) ఇంటిగ్రేటెడ్ వస్తు, సేవల పన్ను ఒకటి. ఒకదేశం-ఒకే పన్ను భావనకు ఇదే మూలం. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వస్తు, సేవల రవాణా సందర్భంలో ఐజీఎస్‌టీని కేంద్రం వసూలు చేస్తుంది. అధికారులు స్థిరీకరించిన రేట్ల ప్రకారం, ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్రాలు పంచుకుంటాయి. ఇది కూడా సీఎస్‌ఎస్‌టీ తరహాలోనే జమ్మూకాశ్మీర్‌కు కాకుండా మొత్తం దేశానికి వర్తిస్తుంది. పరిమితిని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. ఆల్కాహాలిక్ లిక్కర్‌పై ఐజీఎస్‌టీ ఉండదు. యూటీజీఎస్టీ బిల్లుయూటీజీఎస్‌టీ(కేంద్ర పాలిత ప్రాంతం జీఎస్టీ)... కేంద్ర పాలిత ప్రాంతాల్లో వస్తువులు, సేవలపై పన్ను వసూళ్లకు యూటీజీఎస్టీ నిబంధనలు వర్తిస్తాయి. అసెంబ్లీలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే యూటీజీఎస్టీ అమలవుతుంది. ఢిల్లీ, పుదుచ్చేరిలకు అసెంబ్లీలు ఉన్నందుకు ఆ రెండూ చోట్ల మాత్రం ఎస్‌జీఎస్‌టీ అమలవుతుంది. రాష్ట్రాలకు ఎస్‌జీఎస్టీ అమలవుతున్నందుకు కేంద్ర పాలిత ప్రాంతాల కోసం అతి తక్కువ సమయంలో యూటీజీఎస్టీని రూపొందించారు. ఎస్‌జీఎస్టీలోని నిబంధనలే దాదాపుగా యూటీజీఎస్టీలో పొందుపర్చారు. రాష్ట్రాలకు పరిహార బిల్లుజీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే నష్టం భర్తీ కోసం పరిహార చట్టాన్ని రూపొందించారు. నష్టాల భర్తీ కోసం రాష్ట్రాలకు మొదటి సంవత్సరం రూ. 50 వేల కోట్లు చెల్లించాల్సి రావచ్చని కేంద్రం అంచనా వేసింది. ఈ మొత్తంలో రూ. 26 వేల కోట్లను క్లీన్ ఎన్విరాన్‌మెంట్ సెస్సుగా వసూలు చేస్తారు. ఇక మిగతా రూ. 24 వేల కోట్లను పొగాకు, విలాసవంతమైన కార్లు, పాన్ మసాల, కొన్ని శీతల పానీయాలపై అదనపు పన్ను ద్వారా సేకరిస్తారు. జీఎస్టీ అమలు తేదీ నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తారు. రెండు నెలలకోసారి రాష్ట్రాలకు చెల్లింపులు చేస్తారు. ఐదేళ్ల అనంతరం పరిహార నిధిలో మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. 2016-17లో కేంద్ర పన్నుల వసూళ్లు రూ.17.10 లక్షల కోట్లు 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వసూళ్లు రూ.17.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 4న వెల్లడించింది. 2017 ఫిబ్రవరిలో బడ్జెట్ సందర్భంగా రూ.16.97 లక్షల కోట్ల పన్ను వసూళ్లను అంచనా వేస్తున్నట్టు ప్రభుత్వం సవరించిన లక్ష్యాన్ని పేర్కొంది. కానీ పన్నుల వసూళ్లు అంతకు మించి వసూలయ్యాయి. 2015-16తో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. ప్రసూతి చట్టం-2016కు రాష్ట్రపతి ఆమోదం ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ప్రసూతి చట్టం-2016కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 29న ఆమోదముద్ర వేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న 18 లక్షల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ చట్టం ద్వారా ప్రపంచంలో ప్రసూతి సెలవులు ఎక్కువ ఇచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. కొత్త చట్టం ప్రకారం 50 లేదా అంత కంటే ఎక్కువ మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థలు వారి పిల్లల కోసం కచ్చితంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు కొత్తగా ఐటీఆర్ 1 ఫామ్ఐటీ రిటర్న్స్‌ను సులభంగా దాఖలు చేసేందుకు వీలుగా ఒకే ఒక్క పేజీతో కూడిన ఐటీఆర్ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి 31న నోటిఫై చేసింది. ప్రస్తుతం ఉన్న ఏడు పేజీల ఐటీఆర్ పత్రం స్థానంలో ఆదాయపన్ను శాఖ కొత్తగా ఫామ్-1 సహజ్‌ను తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జీతం పెంపురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తోపాటు డిప్యూటీ గవర్నర్ల జీతాలను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గవర్నర్, డిప్యూటీ గవర్నర్‌ల మూల వేతనాలు ఏకంగా 100 శాతం మేర పెరిగాయి. తాజా పెంపుతో ఉర్జిత్ పటేల్.. నెలకు రూ.2.50 లక్షల జీతం అందుకోనుండగా.. డిప్యూటీ గవర్నర్‌లు రూ.2.25 లక్షలు పొందనున్నారు. అతి పెద్ద బ్యాంక్‌గా అవతరించిన ఎస్‌బీఐభారతీయ స్టేట్ బ్యాంకు-ఎస్‌బీఐలో ఆరు అనుబంధ బ్యాంకులు (స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, భారతీయ మహిళా బ్యాంకు) ఏప్రిల్ 1న విలీనమయ్యాయి. దీంతో ఎస్‌బీఐ ఖాతాదారుల సంఖ్య 37 కోట్లకు చేరింది. ఈ ప్రక్రియతో దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ శాఖల సంఖ్య 24 వేలకు చేరగా సంస్థ ఆధ్వర్యంలోని ఏటీఎంల సంఖ్య 59 వేలకు పెరిగింది. విద్యుత్‌లో నికర ఎగుమతులు నమోదు చేసిన భారత్ ఇన్నాళ్లూ విద్యుత్ దిగుమతిపై అధికంగా ఆధారపడిన భారత్ మొదటిసారి నికర ఎగుమతి దారుగా నిలిచింది. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశాలకు భారత్ 5,798 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఎగుమతి చేయడం ద్వారా ఈ గుర్తింపు పొందిందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మార్చి 29న వెల్లడించింది. మొత్తంగా గత మూడేళ్లలో భారత్ నుంచి విద్యుత్ ఎగుమతులు నేపాల్‌కు 2.5 రెట్లు, బంగ్లాదేశ్‌కు 2.8 రెట్లు పెరిగాయి. భూటాన్ నుంచి భారత్ సగటున ఏటా 5,000 - 5,500 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి చేసుకుంటోంది. 3 ఉక్కు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) ఆధ్వర్యంలోని విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్, భద్రావతి, సేలమ్ స్టీల్ ప్లాంట్ అండ్ సహా అనుబంధ సంస్థల్లో కేంద్రం పెట్టుబడులు ఉపసంహరించింది. ఈ మేరకు మార్చి 29న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. స్వయం సేవక బృందాలతో బ్యాంకింగ్ సేవలు స్వయం సేవక బృందాల (Self Help Groups - SHG) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఒడిశా గుర్తింపు పొందింది. ఈ మేరకు కార్యక్రమం అమలు కోసం ఒడిశా ప్రభుత్వం తరపున ఒడిశా లైవ్‌లీహుడ్ మిషన్(ఓఎల్‌ఎమ్) సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్-ఎస్‌బీఐతో మార్చి 29న ఒప్పందం కుదుర్చుకుంది. |
Saturday, 15 April 2017
ఏప్రిల్ 2017 ఎకానమీ
Subscribe to:
Comments (Atom)