దేశంలోనే ధనిక నగరంగా ముంబైదేశ ఆర్థిక రాజధాని ముంబై దేశంలోనే ధనిక నగరంగా నిలిచింది. 46,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లకు ముంబై నివాస స్థలంగా ఉంది. ముంబైలో మొత్తం సంపద 820 బిలియన్ డాలర్లుగా ఉందని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక తెలిపింది. సంపద పరంగా ముంబై తర్వాత స్థానాల్లో వరుసగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. ఢిల్లీలో 23,000 మంది మిలియనీర్లు, 18 మంది బిలియనీర్లు ఉన్నారు. మొత్తం సంపద 450 బిలియన్ డాలర్లు. బెంగళూరులో 7,700 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం సంపద 320 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో 9,000 మంది మిలియనీర్లు, ఆరుగురు బిలియనీర్లు ఉన్నారు. వీరి సంపద 310 బిలియన్ డాలర్లు. దేశంలో మొత్తం సంపద 6.2 లక్షల కోట్ల డాలర్లు కాగా, 2,64,000 మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నారు.
టాప్-5 సంపన్న నగరాల జాబితా
దీన్‌దయాళ్ అధ్యయన కేంద్రాలకు యూజీసీ ఆమోదంరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరుపై విశ్వవిద్యాలయాల్లో అధ్యయన కేంద్రాలను స్థాపించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC అంగీకరించింది. ఈ మేరకు వీటి ఏర్పాటు కోసం ఫిబ్రవరి 22న అనుమతులు జారీ చేసింది. ఈ కేంద్రాల ద్వారా దీన్ దయాళ్ రచనలు, సిద్ధాంతాలపై పరిశోధనలు చేయనున్నారు. దేశంలో 20 ప్రపంచ స్థాయి విద్యాసంస్థలను నెలకొల్పేందుకు ప్రతిపాదించిన మార్గదర్శకాలకూ యూజీసీ ఆమోదం లభించింది.
శుద్ధి కేంద్రాలు లేకపోతే పరిశ్రమలు మూతే: సుప్రీంకోర్టు పరిశ్రమల వ్యర్థాలు నీటి వనరుల్లో కలవకుండా ప్రాథమిక వ్యర్థాల శుద్ధి కేంద్రాలు(PETP) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 22న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 3 నెలల లోపు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయని పరిశ్రమలను మూసివేయాలని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డు(PCB) లను ఆదేశించింది. పట్టణాలు, నగరాల్లో 3 ఏళ్లలోగా కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు-CEPTలను ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు సూచించింది.
టెలినార్ ఇండియాను కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్టెలికం రంగంలో అగ్రగామిగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్ టెలినార్ ఇండియాను కొనుగోలు చేసింది. ఈ మేరకు 7 సర్కిళ్లలో టెలినార్ కార్యకలాపాలను కొనుగోలు చేస్తూ ఫిబ్రవరి 23న ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఎయిర్‌టెల్ టెలినార్‌కు నగదు రూపంలో ఎలాంటి చెల్లింపులూ చేయదు. ఆ కంపెనీ భవిష్యత్తులో స్పెక్ట్రం లెసైన్‌స కోసం చెల్లించాల్సిన ఫీజులు, మొబైల్ టవర్ల అద్దెలు అన్నీ కలుపుకొని రూ.1,600 కోట్లను ఎయిర్‌టెల్ భరిస్తుంది. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి 12 నెలల సమయం పడుతుంది.
ప్రస్తుతం 7 సర్కిళ్లలో కలిపి టెలీనార్‌కు 4.4 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఎయిర్‌టెల్‌కు ప్రస్తుతం 26.9 కోట్ల మంది వినియోగదారులు ఉండగా ఒప్పందం అమల్లోకి వస్తే ఆ సంఖ్య 30 కోట్లను మించనుంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-162015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-4) నివేదికను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గత పదేళల్లో దేశంలో శిశుమరణాల రేటు-IMR గణనీయంగా తగ్గింది. 2005-06లో ప్రతి వేయి మంది శిశువులకు 57 మంది చనిపోతుండగా 2015-16 నాటికి ఆ రేటు 41కి పడిపోయింది. దేశవ్యాప్తంగా 6 లక్షల గృహాలు, 7 లక్షల మంది మహిళలు, 1.3 లక్షల పురుషుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించారు.
సర్వే వివరాలు
2016-17లో భారత్ వృద్ధి 7.1 శాతం : సీఎస్‌వో2016-17లో భారత వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంకాల శాఖ-CSO అంచనా వేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం మూడవ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారత్ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది.
2016-17 సీఎస్‌వో అంచనాలు
జీఎస్టీ పరిహార చట్టానికి అంగీకారంవస్తు-సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో రాష్ట్రాలకు జరిగే నష్టానికి పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన ముసాయిదా చట్టంపై జీఎస్టీ మండలి సమావేశంలో అంగీకారం కుదిరింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 18న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన జీఎస్టీ మండలి పదో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
జనవరిలో 3.17 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం
కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు తగ్గడంతో 2017 జనవరిలో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) గణనీయంగా తగ్గి 3.17 శాతంగా నమోదైంది. ఇది దాదాపు మూడేళ్ల కనిష్ట స్థాయి. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్ర గణాంక, పథకాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 10న విడుదల చేసింది. కాగా, సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 2016, జనవరిలో 5.69 శాతంగా, డిసెంబర్‌లో 3.41 శాతంగా నమోదైంది.
జనవరిలో 5.25 శాతంగా టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీ) ఆధారిత ద్రవ్యోల్బణం మరింత పెరిగి జనవరిలో 5.25 శాతానికి చేరింది. ఇది గత డిసెంబర్‌లో 3.39 శా తం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఫిబ్రవరి 14న వాణిజ్య మంత్రిత్వశాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం చమురు, విద్యుత్ రంగాల్లో ధరలు రెండింతలయ్యాయి. కాగా, డబ్ల్యూపీఐ 2016, జనవరిలో మైనస్ 1.107 శాతంగా ఉండటం గమనార్హం.
2021కి 55 బిలియన్ డాలర్లకు చేరనున్న ఈ-కామర్స్ 2021 నాటికి భారత ఈ-కామర్స్ మార్కెట్ విలువ 50 నుంచి 55 బిలియన్ డాలర్లకు చేరుతుందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లు వెల్లడించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 15న విడుదల చేసిన నివేదికలో ప్రస్తుతం ఈ-కామర్స్ మార్కెట్ విలువ 6-8 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నాయి. 2025 నాటికి ఈ రంగంలో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విస్తరణ గరిష్టంగా 38-42 శాతంగా ఉండొచ్చని అంచనా.
ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి కేబినెట్ ఆమోదం
భారతీయ స్టేట్ బ్యాంక్-SBIలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 15న ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి తుది అనుమతులు జారీ చేసిన కేబినెట్ భారతీయ మహిళా బ్యాంకు విలీనం విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు.
ఈ విలీనంతో 22,500 శాఖలు, 58,000 ఏటీఎంలు, రూ.37 లక్షల కోట్ల విలువైన ఆస్తులతో ఎస్‌బీఐ అంతర్జాతీయంగా అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా అవతరిస్తుంది. విలీనం వల్ల తొలి ఏడాదిలోనే రూ.1,000 కోట్ల మేర నిర్వహణ వ్యయం ఆదా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌లు ఇంతకముందే ఎస్‌బీఐలో విలీనమయ్యాయి.
కొత్తగా విలీనం అయ్యే బ్యాంకులు
ఏప్రిల్ 1 నుంచి డెబిట్ కార్డుపై ఎండీఆర్ చార్జీలు తగ్గింపు
డెబిట్ కార్డులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు-MDRను తగ్గించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ మేరకు ఫిబ్రవరి 16న ముసాయిదాను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. MDR అనేది డెబిట్ కార్డు లావాదేవీల విలువపై దుకాణాదారుల నుంచి వసూలు చేసే చార్జీ.
MDRపై ఆర్బీఐ ప్రతిపాదనలు
ఆభరణాల కొనుగోలు రూ.2 లక్షలు దాటితే పన్ను
ఆభరణాల కొనుగోళ్లలో 2 లక్షలకు మించిన నగదు లావాదేవీలకు ఒక శాతం మూలం వద్ద పన్ను కోత (టీసీఎస్) విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ 2017-18 బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించడంతో టీసీఎస్ విధింపునకు ఉన్న రూ.5 లక్షల పరిమితిని రూ.2 లక్షలకు తగ్గించాలని ఆర్థిక బిల్లు 2017లో పేర్కొన్నారు.
సైబర్ స్వచ్ఛత కేంద్ర పథకం ప్రారంభం
సైబర్ దాడుల నుంచి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం "సైబర్ స్వచ్ఛత కేంద్ర" (Cyber Swachhata Kendra or cyber hygiene centre) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ఉచిత యాంటీ వైరస్ టూల్స్‌ను ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి తెచ్చింది. www.cyberswachhtakendra.gov.in వెబ్‌సైట్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లని సి-డాక్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 58 ఐఎస్‌పీలు, 13 బ్యాంకులు ఈ వ్యవస్థను ఉపయోగించుకోవడానికి ముందుకొచ్చాయి.
‘సైబర్ స్వచ్ఛత కేంద్ర’ ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో కేంద్రం రూ.90 కోట్లు వెచ్చించనుంది. 2017 జూన్ నాటికి ఏర్పాటు చేయనున్న నేషనల్ సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్-NCCC కి రూ.900 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్‌లో వరల్డ్ ఎండో 2017 సదస్సు
హైదరాబాద్ HICCలో ఫిబ్రవరి 16న వరల్డ్ ఎండో 2017 సదస్సు ప్రారంభమైంది. వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సులో 68 దేశాలకు చెందిన 3,500 మంది వైద్యులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వర్‌రెడ్డి వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
డిజిటల్ అక్షరాస్యతకు PMGDISHAప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్- PMGDISHA కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ ఫిబ్రవరి 8న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా 6 కోట్ల మంది గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ అక్షరాస్యత అందిస్తారు. దీని అమలు కోసం రూ.2,351 కోట్లు ప్రతిపాదించిన కేంద్రం 2019 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షఫిబ్రవరి 8న జరిగిన ఆర్బీఐ పాలసీ విధాన సమీక్షలో పరిపతి విధాన కమిటీ (MPC) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. నోట్ల రద్దు, ద్రవ్యోల్బణం, ఉత్పత్తి-సరఫరాల పరిస్థితిపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నందునే పరిపతి విధానంలో మార్పులు చేయలేదని ఆర్బీఐ పేర్కొంది. తదుపరి విధాన సమీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో జరుగుతుంది.
సమీక్ష ముఖ్యాంశాలు
రేషన్‌కు ఆధార్ తప్పనిసరి చేసిన కేంద్రంరేషన్ దుకాణాల్లో సరుకులు పొందడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆధార్ చట్టం కింద ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ప్రస్తుత లబ్ధిదారులంతా రేషన్ కార్డులను ఆధార్‌తో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ లేని లబ్ధిదారులు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకూ దేశంలో 72 శాతం రేషన్ కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమైనందున ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది.
తపాలాశాఖతో నేషనల్ కెరీర్ సర్వీస్ అనుసంధానందేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్మిక శాఖ ప్రారంభించిన నేషనల్ కెరీర్ సర్వీస్-NCS పథకం తపాలా శాఖతో అనుసంధానమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, భారత తపాలాశాఖ కార్యదర్శి బి.వి.సుధాకర్‌ల సమక్షంలో ఫిబ్రవరి 12న రెండు శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తపాలా కార్యాలయాల్లో ఏర్పాటయ్యే NCS కేంద్రాల్లో ఉద్యోగార్థులు తమ విద్యా వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ సమాచారంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. ఈ సేవలు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యాయి.
నవీ ముంబయి ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్ దక్కించుకున్న జీవీకేనవీ ముంబై ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును జీవీకే గ్రూపు దక్కించుకుంది. ఈ మేరకు గుత్తేదారు బాధ్యతలు జీవీకేకు అప్పగిస్తున్నట్లు సిటీ అండ్ ఇండ్రస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-సిడ్కీ ఫిబ్రవరి 13న ప్రకటించింది.
రూ.16,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి జీవీకే, జీఎంఆర్ సంస్థలు పోటీపడ్డాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్-PPP మోడల్‌లో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆదాయంలో 12.60 శాతం వాటా ఇవ్వడానికి జీవీకే ముందుకు రాగా, జీఎంఆర్ 10.44 శాతం ఆఫర్ చేసింది. ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టులను జీవీకే... ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులను జీఎంఆర్ నిర్వహిస్తున్నాయి.
పోస్టల్ బ్యాంకుకు రూ. 500 కోట్లు 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ వెలువరిచిన కేంద్రం కేటాయింపుల్లో రూ.125 కోట్లు మూలధనం, రూ.375 కోట్లు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అని వివరించింది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-ఐపీపీబీ ఇటీవలే రాయ్‌పూర్, రాంచీల్లో సేవలు ప్రారంభించింది. 2017 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 650 బ్రాంచీల ఏర్పాటు చేయనుంది.
కేంద్ర బడ్జెట్ 2017-18 నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న 2017-18 వార్షిక ఆర్థిక ప్రణాళికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మార్పు, శక్తిమంతం, స్వచ్ఛ భారత్ (TEC-Transfrom, Energise, Clean India) నినాదంతో రూ.21,46,735 కోట్ల విలువైన బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచారు. పెద్ద నోట్ల రద్దు చర్య నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ, డిజిటల్ లావాదేవీలను పెంపొందించడం, గ్రామాల్లోనూ దీనిని ప్రోత్సహించడంపై జైట్లీ దృష్టి సారించారు. డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం నుంచి డిజిటలీకరణ మౌలిక సదుపాయాలను విస్తరించడం వరకూ అనేక నిర్ణయాలు వివరించారు. 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి తొలిసారి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపి ప్రవేశపెట్టారు.
2017-18 బడ్జెట్ హైలెట్స్
పన్నుల్లో రాష్ట్రాల వాటా రూ. 6,74,565 కోట్లు 2017-18 బడ్జెట్ ప్రకారం వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయంలో రూ.6,74,565 కోట్లు రాష్ట్రాలకు దక్కనున్నాయి. ఇలా సమకూరే మొత్తంలో రాష్ట్రాలకు 42 శాతం కేటాయించలన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం ఈ కేటాయింపులు చేసింది.
2017-18లో భారత వృద్ధి రేటు 7.1 శాతం: హెచ్‌ఎస్‌బీసీ 2017-18లో భారత స్థూల దేశీయోత్పత్తి-GDP రేటు 7.1 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ HSBC పేర్కొంది. వచ్చే సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధ్యయనంతో ఆ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. 2016-17 వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
ముల్కనూరు డెయిరీకి ఉత్తమ సొసైటీ అవార్డు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ స్వకృషి డెయిరీకి జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ-NDDB ఉత్తమ సహకార సంఘం అవార్డు లభించింది. ఫిబ్రవరి 2న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో డెయిరీ ప్రతినిధులు పురస్కారాన్ని అందుకున్నారు. మహిళల భాగస్వామ్యంతో 2002లో ప్రారంభమైన ఈ డెయిరీ మూడు సార్లు ఐఎస్‌వో గుర్తింపు పొందింది.
నగదు బదిలీతో రూ.21 వేల కోట్లు ఆదా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం-PAHAL (ప్రత్యక్ష హస్తాంతరిత్ లాభ్) ద్వారా 3.3 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లను అరికట్టామని ఫిబ్రవరి 7న కేంద్రం ప్రకటించింది. తద్వారా ప్రభుత్వానికి రెండేళ్లలో రూ. 21 వేల కోట్ల రాయితీ ఆదా అయిందని వివరించింది. 2014లో ప్రారంభించిన పాహల్ విధానం ద్వారా ఇప్పటి వరకూ 17.6 కోట్ల మంది వినియోగదారులకు రాయితీ కింద రూ.40 వేల కోట్లు బదిలీ చేసినట్లు వెల్లడించింది. పహల్ పథకం ప్రపంచంలో అత్యధిక మందికి లబ్ధి చేకూరుస్తున్న విధానంగా ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు సంపాదించింది.
టాప్-5 సంపన్న నగరాల జాబితా
నగరం
|
మిలియనీర్లు
|
బిలియనీర్లు
|
సంపద విలువ (లక్షల కోట్లలో)
|
ముంబై
|
45,000
|
28
|
53.3
|
ఢిల్లీ
|
22,000
|
18
|
29.2
|
బెంగళూరు
|
7,500
|
8
|
20.8
|
హైదరాబాద్
|
8,200
|
7
|
20.1
|
కోల్‌కతా
|
8,600
|
10
|
-

- త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, ఒడిశాల్లో 20 శాతానికి పైగా తగ్గిన శిశు మరణాల రేటు.
- జనన సమయంలో లింగ నిష్పత్తి (ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) జాతీయ స్థాయిలో 914 నుంచి 919కి పెరిగింది. ఈ జాబితాలో కేరళ(1047), మేఘాలయ(1009), ఛత్తీస్‌గఢ్(977) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
- ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 38.7 శాతం నుంచి 78.9 శాతానికి పెరిగింది.
- 7 శాతం తగ్గిన తక్కువ బరువున్న పిల్లల సంఖ్య.
- 6-59 నెలల మధ్యనున్న పిల్లల్లో 69 శాతం నుంచి 59 శాతానికి తగ్గిన అనీమియా.
- 2005-06లో(NFHS-3) 8.5 శాతంగా ఉన్న జాతీయ సగటు సిజేరియన్ శస్త్ర చికిత్సలు 2015-16 నాటికి 17.2 శాతానికి పెరిగాయి. ప్రైవేట్ రంగంలో ఇవి 2005-06లో 27.7 శాతంగా ఉండగా 2015-16 నాటికి 40 శాతానికి చేరాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ చికిత్సలు 2015-16 కాలానికి 15.2 శాతం నుంచి 11.9 శాతానికి పడిపోయాయి.
2016-17లో భారత్ వృద్ధి 7.1 శాతం : సీఎస్‌వో2016-17లో భారత వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంకాల శాఖ-CSO అంచనా వేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం మూడవ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారత్ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది.
2016-17 సీఎస్‌వో అంచనాలు
- అక్టోబర్- డిసెంబర్ మధ్య కాలంలో తయారీ రంగంలో 8.3 శాతం వృద్ధి. జూలై-సెప్టెంబర్‌లో ఇది 6.9 శాతంగా ఉంది. మొత్తంగా 2016-17లో తయారీ రంగం వృద్ధి 10.6 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గుతుందని అంచనా.
- మూడో త్రైమాసికంలో 6 శాతంగా వ్యవసాయరంగం వృద్ధి. మొత్తంగా 2016-17లో ఇది 4.4 శాతంగా ఉండొచ్చని అంచనా.
- ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.113.58 లక్షల కోట్ల నుంచి రూ.121.65 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.
- 7.8 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గనున్న స్థూల విలువ ఆధారిత (GVA) వాస్తవిక జీడీపీ రేటు.
- తలసరి ఆదాయం 10.2 శాతం పెరుగుదలతో రూ.94,178 నుంచి రూ.1,03,818 చేరుతుందని అంచనా.
- 2014-15లో భారత్ జీడీపీ వృద్ధి 7.2 శాతం కాగా, 2015-16లో ఈ రేటు 7.9 శాతంగా ఉంది.
జీఎస్టీ పరిహార చట్టానికి అంగీకారంవస్తు-సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో రాష్ట్రాలకు జరిగే నష్టానికి పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన ముసాయిదా చట్టంపై జీఎస్టీ మండలి సమావేశంలో అంగీకారం కుదిరింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 18న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన జీఎస్టీ మండలి పదో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
జనవరిలో 3.17 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం
కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు తగ్గడంతో 2017 జనవరిలో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) గణనీయంగా తగ్గి 3.17 శాతంగా నమోదైంది. ఇది దాదాపు మూడేళ్ల కనిష్ట స్థాయి. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్ర గణాంక, పథకాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 10న విడుదల చేసింది. కాగా, సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 2016, జనవరిలో 5.69 శాతంగా, డిసెంబర్‌లో 3.41 శాతంగా నమోదైంది.
జనవరిలో 5.25 శాతంగా టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీ) ఆధారిత ద్రవ్యోల్బణం మరింత పెరిగి జనవరిలో 5.25 శాతానికి చేరింది. ఇది గత డిసెంబర్‌లో 3.39 శా తం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఫిబ్రవరి 14న వాణిజ్య మంత్రిత్వశాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం చమురు, విద్యుత్ రంగాల్లో ధరలు రెండింతలయ్యాయి. కాగా, డబ్ల్యూపీఐ 2016, జనవరిలో మైనస్ 1.107 శాతంగా ఉండటం గమనార్హం.
2021కి 55 బిలియన్ డాలర్లకు చేరనున్న ఈ-కామర్స్ 2021 నాటికి భారత ఈ-కామర్స్ మార్కెట్ విలువ 50 నుంచి 55 బిలియన్ డాలర్లకు చేరుతుందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లు వెల్లడించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 15న విడుదల చేసిన నివేదికలో ప్రస్తుతం ఈ-కామర్స్ మార్కెట్ విలువ 6-8 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నాయి. 2025 నాటికి ఈ రంగంలో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విస్తరణ గరిష్టంగా 38-42 శాతంగా ఉండొచ్చని అంచనా.
ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి కేబినెట్ ఆమోదం
భారతీయ స్టేట్ బ్యాంక్-SBIలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 15న ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి తుది అనుమతులు జారీ చేసిన కేబినెట్ భారతీయ మహిళా బ్యాంకు విలీనం విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు.
ఈ విలీనంతో 22,500 శాఖలు, 58,000 ఏటీఎంలు, రూ.37 లక్షల కోట్ల విలువైన ఆస్తులతో ఎస్‌బీఐ అంతర్జాతీయంగా అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా అవతరిస్తుంది. విలీనం వల్ల తొలి ఏడాదిలోనే రూ.1,000 కోట్ల మేర నిర్వహణ వ్యయం ఆదా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌లు ఇంతకముందే ఎస్‌బీఐలో విలీనమయ్యాయి.
కొత్తగా విలీనం అయ్యే బ్యాంకులు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
ఏప్రిల్ 1 నుంచి డెబిట్ కార్డుపై ఎండీఆర్ చార్జీలు తగ్గింపు
డెబిట్ కార్డులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు-MDRను తగ్గించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ మేరకు ఫిబ్రవరి 16న ముసాయిదాను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. MDR అనేది డెబిట్ కార్డు లావాదేవీల విలువపై దుకాణాదారుల నుంచి వసూలు చేసే చార్జీ.
MDRపై ఆర్బీఐ ప్రతిపాదనలు
- వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులు, ప్రత్యేక విభాగం కిందకు వచ్చే వ్యాపారులు (విద్యా సంస్థలు, మ్యూచువల్ ఫండ్‌స, ఇన్సూ రెన్‌స, యుటిలిటీలు), ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెబిట్ కార్డు లావాదేవీలకు 0.40 శాతం ఛార్జి.
- డిజిటల్ విధానంలో (క్యూఆర్‌కోడ్) లావాదేవీ జరిగితే 0.30 శాతం ఛార్జి.
- వర్తకులను 4 కేటగిరీలుగా పేర్కొన్న ఆర్బీఐ. కేటగిరి 1- వార్షికంగా రూ.20 లక్షల్లోపు టర్నోవర్ కలిగిన వారు. కేటగిరి 2- వార్షికంగా రూ.20 లక్షలకు మించిన టర్నోవర్ కలిగిన వారు. కేటగిరి 3- ప్రభుత్వ లావాదేవీలు. కేటగిరి 4- ప్రత్యేక కేటగిరీ వర్తకులు.
- ప్రభుత్వ లావాదేవీల్లో రూ.1,000 వరకు లావాదేవీపై ఫ్లాట్‌గా రూ.5 చార్జీ. రూ.1,001 నుంచి రూ.2,000 వరకు ఫ్లాట్‌గా రూ.10 చార్జీ. రూ.2,001కి పైన విలువగల లావాదేవీలపై మొత్తం లావాదేవీ విలువలో చార్జీ 0.50% మించరాదు. ఛార్జి గరిష్ట పరిమితి రూ.250.
- ‘కన్వీనియెన్‌స లేదా సేవా చార్జీని కస్టమర్లు చెల్లించ్సాలిన అవసరం లేదని’ పేర్కొంటూ వ్యాపారులు బోర్డులు పెట్టాలి. ఈ బాధ్యత బ్యాంకులదే.
ఆభరణాల కొనుగోలు రూ.2 లక్షలు దాటితే పన్ను
ఆభరణాల కొనుగోళ్లలో 2 లక్షలకు మించిన నగదు లావాదేవీలకు ఒక శాతం మూలం వద్ద పన్ను కోత (టీసీఎస్) విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ 2017-18 బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించడంతో టీసీఎస్ విధింపునకు ఉన్న రూ.5 లక్షల పరిమితిని రూ.2 లక్షలకు తగ్గించాలని ఆర్థిక బిల్లు 2017లో పేర్కొన్నారు.
సైబర్ స్వచ్ఛత కేంద్ర పథకం ప్రారంభం
సైబర్ దాడుల నుంచి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం "సైబర్ స్వచ్ఛత కేంద్ర" (Cyber Swachhata Kendra or cyber hygiene centre) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ఉచిత యాంటీ వైరస్ టూల్స్‌ను ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి తెచ్చింది. www.cyberswachhtakendra.gov.in వెబ్‌సైట్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లని సి-డాక్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 58 ఐఎస్‌పీలు, 13 బ్యాంకులు ఈ వ్యవస్థను ఉపయోగించుకోవడానికి ముందుకొచ్చాయి.
‘సైబర్ స్వచ్ఛత కేంద్ర’ ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో కేంద్రం రూ.90 కోట్లు వెచ్చించనుంది. 2017 జూన్ నాటికి ఏర్పాటు చేయనున్న నేషనల్ సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్-NCCC కి రూ.900 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్‌లో వరల్డ్ ఎండో 2017 సదస్సు
హైదరాబాద్ HICCలో ఫిబ్రవరి 16న వరల్డ్ ఎండో 2017 సదస్సు ప్రారంభమైంది. వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సులో 68 దేశాలకు చెందిన 3,500 మంది వైద్యులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వర్‌రెడ్డి వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
డిజిటల్ అక్షరాస్యతకు PMGDISHAప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్- PMGDISHA కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ ఫిబ్రవరి 8న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా 6 కోట్ల మంది గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ అక్షరాస్యత అందిస్తారు. దీని అమలు కోసం రూ.2,351 కోట్లు ప్రతిపాదించిన కేంద్రం 2019 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షఫిబ్రవరి 8న జరిగిన ఆర్బీఐ పాలసీ విధాన సమీక్షలో పరిపతి విధాన కమిటీ (MPC) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. నోట్ల రద్దు, ద్రవ్యోల్బణం, ఉత్పత్తి-సరఫరాల పరిస్థితిపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నందునే పరిపతి విధానంలో మార్పులు చేయలేదని ఆర్బీఐ పేర్కొంది. తదుపరి విధాన సమీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో జరుగుతుంది.
సమీక్ష ముఖ్యాంశాలు
- ప్రస్తుతం క్యాష్ రిజర్వ్ రేషియో-CRR 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉంది.
- బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై 6.25 శాతం(రెపో రేటు) వడ్డీ రేటు కొనసాగనుంది.
- 2016-17 వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గింపు. 2017-18లో ఇది 7.4 శాతానికి చేరుతుందని అంచనా.
- 2017-18 తొలి 6 నెలల్లో 4-4.5 శాతం మధ్య ఉండనున్న ద్రవ్యోల్బణం . ఆ తర్వాత ఆరు నెలల్లో 4.5- 5 శాతంగా అంచనా.
రేషన్‌కు ఆధార్ తప్పనిసరి చేసిన కేంద్రంరేషన్ దుకాణాల్లో సరుకులు పొందడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆధార్ చట్టం కింద ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ప్రస్తుత లబ్ధిదారులంతా రేషన్ కార్డులను ఆధార్‌తో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ లేని లబ్ధిదారులు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకూ దేశంలో 72 శాతం రేషన్ కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమైనందున ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది.
తపాలాశాఖతో నేషనల్ కెరీర్ సర్వీస్ అనుసంధానందేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్మిక శాఖ ప్రారంభించిన నేషనల్ కెరీర్ సర్వీస్-NCS పథకం తపాలా శాఖతో అనుసంధానమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, భారత తపాలాశాఖ కార్యదర్శి బి.వి.సుధాకర్‌ల సమక్షంలో ఫిబ్రవరి 12న రెండు శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తపాలా కార్యాలయాల్లో ఏర్పాటయ్యే NCS కేంద్రాల్లో ఉద్యోగార్థులు తమ విద్యా వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ సమాచారంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. ఈ సేవలు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యాయి.
నవీ ముంబయి ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్ దక్కించుకున్న జీవీకేనవీ ముంబై ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును జీవీకే గ్రూపు దక్కించుకుంది. ఈ మేరకు గుత్తేదారు బాధ్యతలు జీవీకేకు అప్పగిస్తున్నట్లు సిటీ అండ్ ఇండ్రస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-సిడ్కీ ఫిబ్రవరి 13న ప్రకటించింది.
రూ.16,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి జీవీకే, జీఎంఆర్ సంస్థలు పోటీపడ్డాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్-PPP మోడల్‌లో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆదాయంలో 12.60 శాతం వాటా ఇవ్వడానికి జీవీకే ముందుకు రాగా, జీఎంఆర్ 10.44 శాతం ఆఫర్ చేసింది. ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టులను జీవీకే... ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులను జీఎంఆర్ నిర్వహిస్తున్నాయి.
పోస్టల్ బ్యాంకుకు రూ. 500 కోట్లు 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ వెలువరిచిన కేంద్రం కేటాయింపుల్లో రూ.125 కోట్లు మూలధనం, రూ.375 కోట్లు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అని వివరించింది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-ఐపీపీబీ ఇటీవలే రాయ్‌పూర్, రాంచీల్లో సేవలు ప్రారంభించింది. 2017 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 650 బ్రాంచీల ఏర్పాటు చేయనుంది.
కేంద్ర బడ్జెట్ 2017-18 నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న 2017-18 వార్షిక ఆర్థిక ప్రణాళికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మార్పు, శక్తిమంతం, స్వచ్ఛ భారత్ (TEC-Transfrom, Energise, Clean India) నినాదంతో రూ.21,46,735 కోట్ల విలువైన బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచారు. పెద్ద నోట్ల రద్దు చర్య నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ, డిజిటల్ లావాదేవీలను పెంపొందించడం, గ్రామాల్లోనూ దీనిని ప్రోత్సహించడంపై జైట్లీ దృష్టి సారించారు. డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం నుంచి డిజిటలీకరణ మౌలిక సదుపాయాలను విస్తరించడం వరకూ అనేక నిర్ణయాలు వివరించారు. 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి తొలిసారి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపి ప్రవేశపెట్టారు.
2017-18 బడ్జెట్ హైలెట్స్
- మొత్తం బడ్జెట్ రూ.21,46,735 కోట్లు
- పథకాల వ్యయం రూ.9,45,078 కోట్లు
- ఇతర వ్యయం రూ. 12,01,657 కోట్లు
- రూ.5 లక్షల లోపు ఆదాయంపై పన్ను 5 శాతానికి తగ్గింపు.
- రిబేట్ (పన్ను తిరిగి చెల్లింపు) రూ.5,000 నుంచి రూ. 2,500కు తగ్గింపు.
- రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపు ఆదాయంపై 20 శాతం పన్ను.
- పన్ను ఆదాయం రూ.50 లక్షలు దాటితే 10 శాతం సర్‌చార్జీ.
- రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలపై కార్పొరేట్ పన్ను 30 నుంచి 25 శాతానికి తగ్గింపు.
- రూ.3 లక్షలకు పైబడిన అన్ని నగదు లావాదేవీల నిషేధం.
- 2017-18లో వ్యవసాయ వృద్ధి లక్ష్యం 4.1 శాతం. రుణాల మంజూరు లక్ష్యం రూ.10 లక్షల కోట్లు. 5 ఏళ్లలో రైతుల ఆదాయం రెండింతలయ్యేలా చర్యలు.
- రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు పైబడిన నగదు విరాళాలపై నిషేధం.
- రైల్వేలకు రూ. 1.31 లక్షల కోట్లు కేటాయింపు.
- IRCTC ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై సర్వీసు చార్జీల ఎత్తివేత.
- చెక్ బౌన్‌స కేసులకు సంబంధించి ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్’కు సవరణలు.
- దేశం విడిచి పారిపోయిన ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణలు.
- LNG (గ్యాస్)పై కస్టమ్స్ పన్ను 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింపు.
- వయోవృద్ధులకు ఆధార్ ఆధారిత ఆరోగ్య కార్డులు. కనీసం 8 శాతం రాబడినిచ్చే వర్షిత పింఛన్ పథకం ఏర్పాటు
- POS పరికరాలపై సుంకం రద్దు. మార్చికల్లా 10 లక్షల పీఓఎస్‌ల కొనుగోలు.
- 2017-18 లో 2.50 లక్షల డిజిటల్ లావాదేవీల లక్ష్యం.
- దేశంలో ఇంటర్నెట్ విస్తృతి కోసం భారత్ నెట్‌కు రూ. 10 వేల కోట్లు నిధులు.
- గ్రామీణుల కోసం కొత్తగా ‘డిజి గావ్’ ప్రారంభం
- 2018 మే నాటికి దేశంలోని 100 శాతం గ్రామాలకు విద్యుత్.
- పేదలకు 2019 నాటికి కోటి గృహాల నిర్మాణం
- FDIల ప్రోత్సాహకానికి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు-FIPB రద్దు
- డిజిటల్ పేమెంట్ల పర్యవేక్షణకు ‘పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు’ ఏర్పాటు
- స్థిరాస్తులపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్‌స పన్ను గడువు మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు
- 2017-18లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.8 శాతం, పరోక్ష పన్నుల వసూళ్లు 8.3 శాతం పెరుగుతాయని అంచనా.
- 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆహారం, ఎరువులు, పెట్రో ఉత్పత్తులు తదితరాలపై రాయితీల అంచనా రూ. 2,40,338 కోట్లు. చక్కెరపై రాయితీ ఎత్తివేత.
- ప్రభుత్వ బ్యాంకులకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు
- 2017-18లో రూ.72 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు విక్రయించినవారికి పన్ను మినహాయింపు. రాష్ట్రం ఏర్పాటు అయిన 2014 నుంచి ల్యాండ్ పూలింగ్‌లో ఉన్నవారికి క్యాపిటల్ గెయిన్స్ రద్దు.
- మౌలిక వసతుల కల్పనకు రూ.3.96 లక్షల కోట్లు.
- రక్షణ రంగానికి రూ.2,74,114 కోట్లు.
- హోంశాఖకు రూ. రూ.83 వేల కోట్లు.
- మహిళా శిశు సంక్షేమానికి రూ.1.84 లక్షల కోట్లు.
- వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.87 లక్షల కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి రూ. 52,393 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.31,920 కోట్లు, మైనారిటీ వ్యవహారాలకు రూ.4,195 కోట్లు.
- వైద్యం, ఆరోగ్యానికి రూ.47,352 కోట్లు
- గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1,07,758 కోట్లు. ( అత్యధికంగా ఉపాధి హామీకి రూ.48 వేల కోట్లు. పథకం ప్రవేశపెట్టిన తర్వాత కేటాయింపుల్లో ఇదే అత్యధికం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMYAకు రూ.23 వేల కోట్లు. రూ. 20 వేల కోట్ల గృహ రుణాలు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన-PMGSYకు రూ. 19 వేల కోట్లు)
- స్వచ్ఛ భారత్‌కు రూ.13,948 కోట్లు.
- శాస్త్ర, సాంకేతిక రంగానికి రూ.37,435 కోట్లు.
- పర్యాటక రంగానికి రూ. 1,840 కోట్లు.
- జాతీయ రహదారులకు రూ. 64 వేల కోట్లు.
- రవాణాశాఖకు రూ.1,24,373 కోట్లు.
- పాఠశాల విద్య, అక్షరాస్యతకు రూ.46,356 కోట్లు. ఉన్నత విద్యకు రూ.33,329 కోట్లు.
- 2017-18లో ద్రవ్యలోటు లక్ష్యం 3.2 శాతం.
- 2018-19లో ద్రవ్యలోటుని 3 శాతంగా కొనసాగిస్తామని హామీ.
- 2016-17లో ద్రవ్యలోటు 3.5 శాతం.
- 2016-17లో రెవెన్యూ లోటు 2.1 శాతం
- 2017-18లో రెవెన్యూ లోటు 1.9 శాతం
పన్నుల్లో రాష్ట్రాల వాటా రూ. 6,74,565 కోట్లు 2017-18 బడ్జెట్ ప్రకారం వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయంలో రూ.6,74,565 కోట్లు రాష్ట్రాలకు దక్కనున్నాయి. ఇలా సమకూరే మొత్తంలో రాష్ట్రాలకు 42 శాతం కేటాయించలన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం ఈ కేటాయింపులు చేసింది.
- అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,21,406 కోట్లు దక్కాయి. మొత్తం కేటాయింపుల్లో ఇది 17.94 శాతం.
- రూ.2,477 కోట్లతో సిక్కింకు అన్ని రాష్ట్రాలకన్నా తక్కువ వాటా దక్కింది.
- ఆంధ్రప్రదేశ్‌కు రూ.29,138 కోట్ల్లు(4.3 శాతం), తెలంగాణకు రూ.16,505 కోట్లు (2.43శాతం) అందనున్నాయి.
2017-18లో భారత వృద్ధి రేటు 7.1 శాతం: హెచ్‌ఎస్‌బీసీ 2017-18లో భారత స్థూల దేశీయోత్పత్తి-GDP రేటు 7.1 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ HSBC పేర్కొంది. వచ్చే సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధ్యయనంతో ఆ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. 2016-17 వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
ముల్కనూరు డెయిరీకి ఉత్తమ సొసైటీ అవార్డు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ స్వకృషి డెయిరీకి జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ-NDDB ఉత్తమ సహకార సంఘం అవార్డు లభించింది. ఫిబ్రవరి 2న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో డెయిరీ ప్రతినిధులు పురస్కారాన్ని అందుకున్నారు. మహిళల భాగస్వామ్యంతో 2002లో ప్రారంభమైన ఈ డెయిరీ మూడు సార్లు ఐఎస్‌వో గుర్తింపు పొందింది.
నగదు బదిలీతో రూ.21 వేల కోట్లు ఆదా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం-PAHAL (ప్రత్యక్ష హస్తాంతరిత్ లాభ్) ద్వారా 3.3 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లను అరికట్టామని ఫిబ్రవరి 7న కేంద్రం ప్రకటించింది. తద్వారా ప్రభుత్వానికి రెండేళ్లలో రూ. 21 వేల కోట్ల రాయితీ ఆదా అయిందని వివరించింది. 2014లో ప్రారంభించిన పాహల్ విధానం ద్వారా ఇప్పటి వరకూ 17.6 కోట్ల మంది వినియోగదారులకు రాయితీ కింద రూ.40 వేల కోట్లు బదిలీ చేసినట్లు వెల్లడించింది. పహల్ పథకం ప్రపంచంలో అత్యధిక మందికి లబ్ధి చేకూరుస్తున్న విధానంగా ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు సంపాదించింది.
No comments:
Post a Comment