Wednesday, 22 March 2017

మార్చి - 2017ఎకానమీ

పర్యావరణంలో కలుస్తోన్న 80 శాతం వ్యర్థ జలాలు 
ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి లేకుండా నేరుగా పర్యావరణంలో కలుస్తున్నాయని వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2017 వెల్లడించింది. ఈ మేరకు మార్చి 22న అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి నీటి విభాగం వేస్ట్ వాటర్ - ద అన్‌టాప్డ్ రిసోర్స్ 2017 పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. అభివృద్ధి చెందని దేశాల్లో ఇది 95 శాతం ఉందని పేర్కొంది. 
నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది, ఏడాదికి కనీసం ఒక నెల పాటైనా నీటి కొరత ఉండే ప్రాంతాల్లో నివసిస్తోండగా ఆ జనాభాలో సగం మంది భారత్, చైనాల్లోనే ఉన్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 36 దేశాలు తీవ్రమైన నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి.


మానవాభివృద్ధి సూచీలో 131వ స్థానంలో భారత్ యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ (మానవాభివృద్ధి సూచీ)ను ఐరాస మార్చి 21న విడుదల చేసింది. మొత్తం 188 దేశాలు (2015 గణాంకాల)తో రూపొందించిన ఈ జాబితాలో భారత్ 131వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్, కెన్యా, మయన్మార్, నేపాల్ వంటి వాటితో కూడిన మధ్యస్థ మానవ అభివృద్ధి దేశాల సరసనే భారత్ ఉంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందిన భారత్ 2014 నివేదికలోనూ 131వ స్థానంలోనే ఉంది. 
నివేదిక ముఖ్యాంశాలు 
  • 2010లో భారత్ మానవాభివృద్ధి సూచీ శ్రేణి విలువ 0.580గా ఉండగా 2015లో ఇది 0.624కు పెరిగింది.
  • దేశంలో ప్రజల జీవనకాలం 68.3 సంవత్సరాలు.
  • తలసరి స్థూల జాతీయ ఆదాయం రూ.3,70,672
  • అవకాశాలు ఎంచుకునే స్వేచ్ఛపై 78 శాతం పురుషులు, 72 శాతం మంది స్త్రీలు సంతృప్తిగా ఉన్నారు.
  • మొత్తం జీవనకాలం సంతృప్తి విషయంలో 4.3 (1 - 10 కొలమానంలో) స్థానంలో భారత్.
  • జీవ ప్రమాణాల విషయంలో సంతృప్తి వ్యక్తం చేసిన 63 శాతం మంది ప్రజలు.

6.55 శాతానికి టోకు ద్రవ్యోల్బణంటోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో మరింత పెరిగి 39 నెలల గరిష్టానికి చేరింది. 2017 జనవరిలో 5.25 శాతం ఉండగా ఫిబ్రవరిలో 6.55 శాతానికి చేరింది. ఆహార, ఆయిల్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు ఫిబ్రవరిలో 2.69 శాతం పెరిగాయి. ఆయిల్ ధరలు జనవరిలో 18.14 శాతం ఉండగా, ఫిబ్రవరిలో 21.02 శాతానికి పెరిగాయి.ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలు తాజా గణాంకాలను 2017 మార్చి 14న విడుదల చేశాయి.

ఈఏపీఐ 2017లో భారత్‌కు 87వ స్థానం ప్రపంచ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫామెన్స్ ఇండెక్స్(ఈఏపీఐ) 2017 సూచీలో భారత్ 87వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) మార్చి 22న ఓ నివేదిక విడుదల చేసింది. మొత్తం 127 దేశాలతో కూడిన ఈ జాబితాలో స్విట్జర్లాండ్ తొలి స్థానంలో నిలవగా బహ్రెయిన్ చివరి స్థానంలో ఉంది. 


2019-20 నాటికి కోటి టన్నుల సామర్థ్యం గల గోదాములుదేశంలో 2019-20 నాటికి కోటి టన్నుల సామర్థ్యం గల అత్యాధునిక గోదాములు(Silos) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా చేపట్టనున్న ఈ నిర్మాణాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) పద్దతిలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్మించనుంది. 

వందజిల్లాల్లో టీబీ నిర్మూలన కార్యక్రమాలు క్షయ (టీబీ) నిర్మూలనకు జాతీయ వ్యూహాత్మక విధానం అవలంబించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు క్షయ వార్షిక నివేదిక 2017ను మార్చి 24న విడుదల చేసింది. ఈ వ్యాధి నిర్మూలనకు ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేసేందుకు దేశవ్యాప్తంగా 100 జిల్లాలను గుర్తించింది. 
ఈ నివేదిక ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా 17.5 లక్షల టీబీ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 24 శాతం. కాగా ప్రపంచ టీబీ కేసుల్లో 60 శాతం భారత్, చైనా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, దక్షిణాఫిక్రా దేశాల్లోనే నమోదవుతున్నాయి. 

గోధుమ, కందిపప్పు దిగుమతిపై 10% పన్ను విదేశాల నుంచి దిగుమతి అయ్యే గోధుమ, కందిపప్పులపై 10 శాతం పన్ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్చి 28న నిర్ణయం తీసుకుంది. 2017లో దేశీయంగా ఈ రెండు పంటల దిగుబడి భారీగా ఉండనుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ధరలు పడిపోయి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. 


జీఎస్టీ అనుబంధ బిల్లులకు కేబినెట్ ఆమోదం వస్తు, సేవల పన్ను అమలులో భాగంగా కేంద్ర కేబినెట్ మార్చి 20న నాలుగు అనుబంధ చట్టాలకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర వస్తు సేవల పన్ను బిల్లు 2017 (సీజీఎస్టీ), సమీకృత వస్తు, సేవల పన్ను బిల్లు 2017 (ఐజీఎస్టీ), కేంద్రపాలిత ప్రాంత వస్తు సేవల పన్ను బిల్లు 2017 (యూటీజీఎస్టీ), వస్తుసేవల పన్ను (రాష్ట్రాలకు పరిహారం) బిల్లు 2017కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ లోక్‌సభ సమావేశాల్లో వీటిని ద్రవ్య బిల్లులుగా ప్రవేశపెడతారు. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు కానుంది. 


ఎస్‌బీఐలో మహిళా బ్యాంకు విలీనానికి కేబినెట్ ఆమోదం ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంకు (బీఎంబీ) వీలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్చి 20న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఎస్‌బీఐలో బీఎంబీ విలీనానికి అంగీకారం తెలిపింది. ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు ఏప్రిల్ 1న విలీనం అవుతున్నాయి. ఆ రోజు నుంచి అనుబంధ బ్యాంకుల శాఖలను ఎస్‌బీఐ బ్రాంచీలుగా, వినియోగదారులను ఎస్బీఐ వినియోగదారులుగా పరిగణిస్తామని ఆర్బీఐ ప్రకటించింది. 


సంతోష సూచిలో 122వ స్థానంలో భారత్సంతోషకర దేశాల జాబితాలో భారత్ 122వ స్థానంలో నిలిచింది. మార్చి 20న అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి 155 దేశాలతో విడుదల చేసిన వరల్డ్ హేపినెస్ రిపోర్ట్ -2017 నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. ప్రజల తలసరి ఆదాయం, సాంఘిక భద్రత, ఆరోగ్యకర జీవితం, నచ్చింది ఎన్నుకోవడంలో ఉండే స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతిపై జాగరూకత ఆధారంగా జాబితాను రూపొందించారు.
2014-15 నివేదిక ప్రకారం భారత్ స్థానం 118 కాగా ఇప్పుడు నాలుగు స్థానాలు తగ్గి చైనా, పాకిస్తాన్, నేపాల్ కంటే వెనుకంజలో నిలిచింది.


ఐడియా-వొడాఫోన్ విలీనానికి కుదిరిన అంగీకారం బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఇండియా, ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులార్ విలీనానికి రెండు సంస్థల మధ్య అంగీకారం కుదిరింది. ఈ ప్రతిపాదనకు మార్చి 20న సమావేశమైన డెరైక్టర్ల బోర్డులు ఆమోదముద్ర వేశాయని ఇరు గ్రూప్‌లు ప్రకటించాయి.
విలీనం ద్వారా ఏర్పాటయే కొత్త కంపెనీ ఆదాయ మార్కెట్ వాటా, కస్టమర్ల సంఖ్య పరంగా ( 40 కోట్లు) దేశీయంగా అగ్రగామి టెల్కోగా అవతరించనుంది. ఇందులో వొడాఫోన్‌కు 45.1 శాతం, ఐడియాకు 26 శాతం వాటా ఉండనుంది. మిగతాది ఇన్వెస్టర్ల చేతిలో ఉంటుంది. పూర్తిగా షేర్ల రూపంలో కుదిరిన ఈ డీల్ రెండేళ్లలోపు పూర్తికావచ్చని భావిస్తున్నారు. కొత్త కంపెనీ ఛైర్మన్‌గా కుమార మంగళం బిర్లా వ్యవహరించనున్నారు. 

2 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై జరిమానారూ.2 లక్షలకుపై బడిన నగదు లావాదేవీలపై వంద శాతం జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒకేసారి 40 చట్టాలకు సవరణలతో కూడిన ఫైనాన్స్ బిల్లుని మార్చి 21న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 2017-18 ఆర్థిక బడ్జెట్‌లో ఈ పరిమితిని రూ.3 లక్షలుగా పేర్కొన్న కేంద్రం తాజాగా దీనిని రెండు లక్షలకు తగ్గించింది. 
ఆర్థిక బిల్లుకు చేసిన మరో సవరణ ప్రకారం జూలై 1 నుంచి పాన్ దరఖాస్తుకు, ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు ఆధార్ సంఖ్య వివరాలను తప్పనిసరి చేశా రు. దీంతో పాన్ కలిగి ఉన్న వారు జూన్ 1 నుంచి తమ ఆధార్ వివరాలను నిర్దేశించిన పద్ధతిలో అధికారులకు తెలియజేయాలి. 


2.41 లక్షల కోట్లకు మీడియా, వినోద వ్యాపారం: ఫిక్కీ
2021 నాటికి దేశీయ మీడియా, వినోద రంగం వ్యాపారం విలువ రూ.2.41 లక్షల కోట్లకు చేరుతుందని ఫిక్కీ, కేపీఎంజీ సంస్థలు వెల్లడించాయి. ఈ మేరకు మార్చి 21న ముంబైలో జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్ సదస్సులో అధ్యయన నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం ఈ రంగంలో వచ్చే నాలుగేళ్ల పాటు వార్షికంగా 13.9 శాతం చొప్పున వృద్ధి నమోదు కానుంది. 
2016-17లో మీడియా, వినోద రంగంలో వృద్ధి
  • ఈ కాలంలో టెలివిజన్ పరిశ్రమలో వృద్ధి 8.5 శాతం.
  • ప్రింట్ మీడియా ఆదాయ వృద్ధి 7 శాతం.
  • సినిమాల ఆదాయంలో వృద్ధి 3 శాతం.
  • డిజిటల్ ప్రకటనల్లో వృద్ధి 28 శాతం. మొత్తం ప్రకటనల ఆదాయంలో 15% ఈ విభాగం సొంతం చేసుకుంది.
  • యానిమేషన్ విభాగంలో 16.4 శాతం వృద్ధి నమోదు.

2016-17 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లలో వృద్ధి 
2016-17 ఆర్థిక సంవత్సరంలో గడచిన 11 నెలల్లో పరోక్ష పన్నుల వసూళ్లు 22.2 శాతం వృద్ధి సాధించాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్ల విషయంలో ఈ రేటు 11 శాతంగా ఉంది. ఈ మేరకు మార్చి 10న పన్నుల గణాంకాలు వెల్లడయ్యాయి. 
గణాంకాల్లో ముఖ్యాంశాలు 
  • ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు మొత్తంగా రూ.13.89 లక్షల కోట్లు. 2016-17 బడ్జెట్ సవరించిన అంచనాల లక్ష్యం (రూ.16.99 లక్షల కోట్లు)లో ఇది 81.5 శాతం.
  • ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.17 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. స్థూలంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) 11.9 శాతంవృద్ధి సాధించగా, వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ) విషయంలో ఈ వృద్ధిరేటు 20.8 శాతంగా ఉంది.
  • పరోక్ష పన్ను వసూళ్లు రూ.7.72 లక్షల కోట్లు. తయారీ రంగం క్రియాశీలతకు సూచికయిన ఎక్సైజ్ సుంకాల వసూళ్లు 36.2 శాతం వృద్ధితో రూ.3.45 లక్షల కోట్లకు చేరాయి. సేవల విభాగం పన్ను వసూళ్లు కూడా 20.8 శాతం పెరిగి రూ.2.21 లక్షలకు ఎగశాయి. ఇక కస్టమ్స్ సుంకాల వసూళ్లు 5.2 శాతం వృద్ధితో రూ.2.05 లక్షల కోట్లకు ఎగశాయి.

దేశంలో మొత్తం నోట్ల విలువ రూ.11.73 లక్షల కోట్లుపెద్ద నోట్లరద్దు తరువాత దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.11.73 లక్షల కోట్లని (మార్చి 3 నాటికి) కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నోట్ల వివరాలను మార్చి 10న పార్లమెంటు ముందు ఉంచారు. 2015-16 మార్చి 31 నాటికి రూ. 16.41 లక్షల కోట్లు విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని ఆయన వివరించారు. 
రూ.500 నోటు ముద్రణకు రూ.2.87నుంచి రూ.3.09ల ఖర్చుకాగా, రూ.2 వేల నోటుకు రూ.3.54 నుంచి రూ. 3.77ల ఖర్చు అవుతుంది. దేశం మొత్తం మీద నాలుగు ముద్రణాలయాలు ఉండగా రెండు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో మరో రెండు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఉన్నాయి.

నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2017 2017 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1.36 కోట్ల మంది మిలియనీర్లు ఉన్నారని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఈ మేరకు 2017 వెల్త్ రిపోర్ట్‌ను మార్చి 1న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం మిలియనీర్లలో 2 శాతం మంది భారత్‌లో ఉన్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 2,024 మంది బిలియనీర్లు ఉండగా అందులో 5 శాతం మంది భారత్‌కు చెందిన వారు. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లోని 125 నగరాల్లో పెరుగుతున్న కుబేరుల సంఖ్యపై అధ్యయనం ఆధారంగా దీన్ని రూపొందించారు.

నివేదికలోని ఇతర వివరాలు
  • నికరంగా 30 మిలియన్ డాలర్లు పైగా సంపద ఉన్న వారిని UHNWIలుగా నైట్ ఫ్రాంక్ వర్గీకరించింది.
  • అత్యంత సంపన్నుల సంఖ్య 2 ఏళ్లలో (2015,2016) 12 శాతం పెరిగింది.
  • UHNWI (Ultra high net worth individuals )ల వృద్ధిలో గతేడాది ఆరు స్థానంలో నిలిచిన భారత్. ఇదే వేగం కొనసాగితే వచ్చే దశాబ్దకాలంలో మూడో స్థానానికి చేరే అవకాశం.
  • అత్యధిక సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ముంబై నిలిచింది. ముంబైలో మొత్తం 1,340 మంది UHNWI ఉన్నారు. తర్వాత స్థానాల్లో ఢిల్లీ (680), కోల్‌కతా (280), హైదరాబాద్ (260 మంది) ఉన్నాయి.
  • నగర సంపద సూచీలో టొరంటో, వాషింగ్టన్ డీసీ, మాస్కోలను అధిగమించి ముంబై 21వ స్థానం దక్కించుకుంది.

ఎస్‌బీఐలో సగటు నిల్వల లేకుంటే ఛార్జీల మోత ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే ఇకపై ఛార్జీలు విధించాలని భారతీయ స్టేట్ బ్యాంక్-ఎస్‌బీఐ మార్చి 4న నిర్ణయించింది. ఇంతకుముందు అమల్లో ఉన్న ఈ విధానాన్ని 2012లో నిలిపివేసిన ఎస్‌బీఐ.. తిరిగి 2017 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం నెలవారీ కనీస నగదు నిల్వ నిర్వహణలో విఫలమైతే సేవింగ్‌‌స ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 జరిమానాతోపాటు సేవా రుసుము విధింపు ఉంటుంది. అలాగే సేవింగ్‌‌స ఖాతాదారులు నెలలో మూడు సార్లు మాత్రమే తమ బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతీ డిపాజిట్‌కు గాను రూ.50, దీనికి సేవా రుసుము కలిపి చెల్లించాలి. ఎస్‌బీఐ ఖాతాదారులు సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఐదు సార్లకు మించి నగదు డ్రా చేస్తే ఆపై ప్రతి లావాదేవికి రూ.10 ఛార్జి పడుతుంది. 

నగదు నిల్వలపై ప్రాంతాల వారీగా ఛార్జీలు (నెలవారీగా)
(సగటు నిల్వలు శాతాల వారీగా తగ్గితే)

ప్రాంతం
సగటు నిల్వ
50 %
50-75 %
75 %+
మెట్రోలు
రూ.5,000
రూ.50
రూ.75
రూ.100
అర్బన్
రూ.3,000
రూ.40
రూ.60
రూ.80
సెబీ అర్బన్
రూ.2,000
రూ.25
రూ.50
రూ.75
గ్రామీణ
రూ.1,000
రూ.20
రూ.30
రూ.50


హురుణ్ వెల్త్ రిపోర్ట్ 2017దేశంలో 1 బిలియన్ డాలర్లు అంతకన్నా ఎక్కువ నికర సంపద కలిగిన బిలియనీర్ల సంఖ్య 143 నుంచి 132కు తగ్గిందని చైనా సంస్థ హురుణ్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ మేరకు మార్చి 7న ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2017 అత్యంత ధనవంతుల జాబితాలో 11 మంది స్థానం కోల్పోయారు. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ (నికర సంపద విలువ 26 బిలియన్ డాలర్లు) కొనసాగుతున్నారు. దేశంలో స్వశక్తితో ఎదిగిన ఏకైక మహిళా బిలియనీర్‌గా కిరణ్ మజుందార్ షా నిలిచారు. 

నగరాల వారీగా ముంబైలో 42 మంది, ఢిల్లీలో 21 మంది, అహ్మదాబాద్‌లో 9 మంది బిలియనీర్లు ఉన్నారు. రాష్ట్రాల వారీగా మహా రాష్ట్రలో 51, ఢిల్లీలో 22, గుజరాత్‌లో 10, కర్ణాటకలో 9 మంది బిలియనీర్లు ఉన్నారు. 

భారత్‌లో అత్యంత సంపన్నులు 
స్థానం
పేరు
సంస్థ
నికర సంపద
1
ముకేశ్ అంబానీ
రిలయన్స్
26 బిలయన్ డాలర్లు
2
ఎస్‌పీ హిందూజా
హిందూజా
14 బిలయన్ డాలర్లు
3
దిలీప్ సంఘ్వీ
సన్‌ఫార్మా
14 బిలయన్ డాలర్లు
4
పల్లోంజీ మిస్త్రీ
టాటా సన్స్
12 బిలియన్ డాలర్లు
5
లక్ష్మీ మిట్టల్
ఎయిర్‌టెల్
12 బిలియన్ డాలర్లు



No comments:

Post a Comment